ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు కూలీల మృతి

ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు కూలీల మృతి

అమరావతి: కృష్ణా జిల్లా నూజివీడులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఏడుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14మంది కూలీలున్నారు.  ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.  మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులంతా నూజివీడులోని లయన్ తండాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఘటనా స్థలంలోనే చనిపోయిన వారు రమేష్, నాగరాజు, బాణావతు స్వనా, భూక్య సోమ్లా, బర్మావత్ బేబీ.. ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తిని బాణావతు నాగుగా అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

చంద్రబాబు దిగ్భ్రాంతి

నూజివీడు రోడ్డు ప్రమాదం.. కూలీల మృతి దిగ్ర్భాంతికి గురిచేసిందని, మృతుల కుంటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పొట్ట చేతబట్టి బతుకుదెరువుకోసం వెళ్తూ నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాధానికి గురై ఐదుగురు కూలీలు మృతి చెందిన ఘటన మనసు కలచివేసింది. వారి ఆత్మకు శాంతికలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం భరోసా కల్పించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తక్షణ చొరవ చూపాలి.  రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు.