ఐదేళ్ల క్రితం ఇదే రోజున మనం అధికారంలోకి వచ్చాం.. వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్

ఐదేళ్ల క్రితం ఇదే రోజున మనం అధికారంలోకి వచ్చాం.. వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 175 స్థానాలకుగానూ 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కాగా, జనసేన ఒకే ఒక నియోజకవర్గంలో విజయం సాధించింది. ఆ జ్ఞాపకాలను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరోసారి స్మరించుకున్నారు. 

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్న వైఎస్ జగన్.. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసిందని తెలిపారు. ప్రజల దీవెనలతో మరోసారి వైసీపీ  అధికారంలోకి రాబోతోందని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు.
 
"దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.." అని వైఎస్ జగన్మోహనరెడ్డి ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.