విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలె

విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలె

రాంచీ: సీబీఎస్ఈ పన్నెండో క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. క్లాస్ 12 విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించాలన్న విషయాన్ని సోరెన్ స్వాగతించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల తేదీలను నిర్ణయించే ముందు మరిన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉందని.. పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్నారు. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతాయన్నారు. చాలా మంది స్టూడెంట్స్ కరోనా బారిన పడ్డారని, కొందరు విద్యార్థులు తమ పేరెంట్స్‌‌ను కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి పరీక్ష తేదీలు నిర్ణయించే ముందు విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సోరెన్ కేంద్రాన్ని కోరారు.