ఆర్మూర్ లో భక్తి శ్రద్ధలతో జెండా జాతర

ఆర్మూర్ లో భక్తి శ్రద్ధలతో జెండా జాతర

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లో మంగళవారం జెండా బాలాజీ జాతర ఘనంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. టౌన్ లోని కింది బజార్ బాలాజీ మందిరంలో ప్రతిష్ఠించిన జెండాకు శరన్నవరాత్రుల పూజలు జరిగాయి. 

సర్వసమాజ్​ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జెండానుశోభాయాత్రగా దోభీఘాట్ మీదుగా తీసుకువెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అప్పగించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన జెండాను చాలా ఏండ్ల నుంచి తిరుమల తిరుపతికి తీసుకెళ్తున్నారు.  అంతకుముందు ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్  వేర్వేరుగా పూజలు చేశారు.