దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీని మంగళవారం రాత్రి కొందరు ధ్వంసం చేశారు. అయితే ఇది మరో వర్గం చర్యేనని కాంగ్రెస్ రెబల్ సర్పంచ్వర్గం ఆరోపిస్తుండడంతో వర్గపోరు ముదురుతోంది. ఈ ఘటనకు నిరసనగా సర్పంచ్ అనుచరులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీలు చింపిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందడంతో గడ్డం త్రిమూర్తులు వర్గీయలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి ఆరోపించారు. ఈ ఘటన మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.
