ఎయిర్ హోస్టస్ రూపల్ అనుమానాస్పద మృతి.. గొంతు కోసి

ఎయిర్ హోస్టస్ రూపల్ అనుమానాస్పద మృతి.. గొంతు కోసి

ముంబైలోని అంధేరీలోని ఓ ఫ్లాట్‌లో 2023 సెప్టెంబర్ 4వ తేదీన సోమవారం తెల్లవారుజామున  ఎయిర్ హోస్టెస్‌ రూపాల్ ఓగ్రే (24) అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటనపై ముంబై పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసి నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా  డీసీపీ దత్తా నలవాడే తెలిపారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజావాడి ఆసుపత్రికి తరలించి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిపారు. బాధిత మహిళ ట్రైనీ ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుందని, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈమె... ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చిందని పోలీసులు తెలిపారు.  

రూపల్ చివరిసారిగా ఆదివారం ఉదయం తన కుటుంబంతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారుజామున హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు  అనుమానిస్తున్నారు.