పొగమంచుతో ఆలస్యంగా నడుస్తున్న విమాన సర్వీసులు

పొగమంచుతో ఆలస్యంగా నడుస్తున్న విమాన సర్వీసులు

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పొగమంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచు కారణంగా  ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం విమాన సర్వీసులు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయానికి రావాల్సిన 4 విమాన సర్వీసుల దారి మళ్లించారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో శంషాబాద్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్‌ దగ్గర జాతీయ రహదారి, ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కూడా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.