స్టూడెంట్లకు ఫ్లిప్ కార్ట్ ఆఫర్

స్టూడెంట్లకు ఫ్లిప్ కార్ట్ ఆఫర్

45 రోజుల పెయిడ్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రొగ్రామ్

ఫెస్టివ్ సేల్‌‌‌‌లో పనిచేసే అవకాశం

సప్లయి చెయిన్‌‌‌‌లో ఇంటర్న్‌‌‌‌గా నియామకం

బిజినెస్‌‌‌‌ డెస్క్, వెలుగు: స్టూడెంట్లకు ఫ్లిప్‌‌‌‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరో ఐదు రోజుల్లో ఫ్లిప్‌‌‌‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రారంభం కాబోతోన్న సందర్భంగా టైర్ 2 సిటీల్లోని స్టూడెంట్లకు పెయిడ్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రొగ్రామ్‌‌‌‌ను తీసుకొచ్చింది. దేశంలోని 21 ప్రాంతాల్లోని స్టూడెంట్లు తమ సప్లయి చెయిన్‌‌‌‌లో ఇంటర్న్‌‌‌‌గా చేరడానికి ఇదొక గొప్ప అవకాశమని ఫ్లిప్‌‌‌‌కార్ట్ చెప్పింది. ఈ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రొగ్రామ్ లాంఛ్‌‌‌‌ప్యాడ్ 45 రోజులు ఉంటుంది. సప్లయి చెయిన్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో స్కిల్స్‌‌‌‌ను సంపాదించుకునేందుకు స్టూడెంట్లకు ఈ ఇంటర్న్‌‌‌‌షిప్ సాయం చేయనుంది. అంతేకాక ఈ–కామర్స్ ఇండస్ట్రీలో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్‌‌‌‌ను ఈ ఇంటర్న్‌‌‌‌షిప్ క్రియేట్ చేస్తుందని ఫ్లిప్‌‌‌‌కార్ట్ తెలిపింది. ఈ–కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ చేసేందుకు వెనుకాల జరిగే ప్రాసెస్‌‌‌‌ను అంతా విద్యార్థులు ఈ ఇంటర్న్‌‌‌‌షిప్ ద్వారా అర్థం చేసుకోనున్నారు. సప్లయి చెయిన్‌‌‌‌లో స్టూడెంట్లు ఎలా పనిచేయాలో తెలుపుతూ ఈ లాంఛ్‌‌‌‌ప్యాడ్‌‌‌‌ను ఫ్లిప్‌‌‌‌కార్ట్ డిజైన్ చేసింది. భవిష్యత్‌‌‌‌లో పూర్తిగా రాటు తేలిన, నైపుణ్యవంతులైన ప్రొఫెషనల్స్‌‌‌‌ను తయారు చేసేందుకు ఈ ప్రొగ్రామ్ సాయం చేయనుందని ప్రకటించింది.

ఫ్లిప్‌‌‌‌కార్ట్ దీని కోసం 21 ప్రాంతాల్లోని పలు ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్లతో కలిసి పనిచేస్తోంది. ఫ్లిప్‌‌‌‌కార్ట్ కలిసి పనిచేస్తోన్న ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్లలో తెలంగాణలోని మేడ్చల్‌‌‌‌, హర్యానాలోని బినోలా, మహారాష్ట్రలోని భివాండి, కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లోని ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌లో చదివే ప్రతిభావంతుమైన విద్యార్థులను గుర్తించి, వారిని తమ ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్లలో నియమించనుంది. సప్లయి చెయిన్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో పలు విభాగాలపై స్టూడెంట్లకు ఫ్లిప్‌‌‌‌కార్ట్ ట్రైనింగ్ ఇస్తుంది. స్టూడెంట్ల హెల్త్, సేఫ్టీకి కూడా ఫ్లిప్‌‌‌‌కార్ట్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. తమ ఫుల్‌‌‌‌ఫిల్‌‌‌‌మెంట్ సెంటర్లలోకి ప్రవేశించేముందు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. ఇంటర్న్‌‌‌‌లు తమ ఫోన్లలో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌‌‌‌ను ఉంచుకోవాలి.

విద్యార్థులకు మంచి వర్కింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ …

నాలెడ్జ్‌‌‌‌ను షేర్ చేయడంలో ఫ్లిప్‌‌‌‌కార్ట్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ఇండియాలో వేగంగా ఎదుగుతోన్న ఈ–కామర్స్ ఇండస్ట్రీలో స్కిల్డ్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను అభివృద్ధి చేస్తోందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా అన్నారు. గతేడాదే ఫ్లిప్‌‌‌‌కార్ట్ లాంచ్​ప్యాడ్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రొగ్రామ్‌‌‌‌ను లాంచ్​ చేసిందని, ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేందుకు విద్యార్థులకు అవసరమైన స్కిల్స్‌‌‌‌ను నేర్పించనున్నామని చెప్పారు. వచ్చే ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో తమ ఇంటర్న్‌‌‌‌లకు మంచి వర్కింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ లభించనుందని పేర్కొన్నారు.