పాకిస్తాన్‎లో వరద బీభత్సం.. 24 గంటల్లోనే 154 మంది మృతి

పాకిస్తాన్‎లో వరద బీభత్సం.. 24 గంటల్లోనే 154 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్, పాక్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో వరదలు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో 154 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. గురువారం నుంచి శుక్రవారం వరకు వానలు దంచికొట్టాయి. దీంతో వరదలు వచ్చి చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. ప్రఖ్యాత కారాకోరం హైవేతో పాటు పీవోకేలోని గిల్గిత్ బాల్టిస్తాన్‎లో బాల్టిస్తాన్ హైవే కూడా ధ్వంసమైంది. 

బిల్డింగులు, వాహనాలకూ డ్యామేజీ జరిగింది. ఒక్క ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎లోనే 125 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రావిన్స్‎లోని బునేర్ జిల్లాలో 75 మంది చనిపోగా.. మన్షేరాలో 17, బజౌర్, బాటాగ్రాం జిల్లాల్లో 18 మంది చొప్పున మృతి చెందారు. అలాగే లోయర్ డిర్‎లో ఐదుగురు, స్వాత్‎లో నలుగురు, షాంగ్లాలో ఇద్దరు చనిపోయారు.