- 11,510 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 1085 అడుగులకు చేరిన నీటిమట్టం
బాల్కొండ, వెలుగు : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడుతున్నందున 11,510 క్యూసెక్కుల నీరు శ్రీరాంసాగర్‌లోకి వస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.50 టీఎంసీలు)కాగా శనివారం సాయంత్రానికి 1085.20 అడుగులు (60.47 టీఎంసీల)నీరు చేరింది.
ఇక్కడి నుంచి కాకతీయ కాల్వకు 4 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌కు 500, మిషన్ భగీరథకు 231, అలీ సాగర్ కెనాల్‌కు 180 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.