రూ.10వేల కోసం మళ్లీ క్యూ కట్టిన వరద బాధితులు

రూ.10వేల కోసం మళ్లీ క్యూ కట్టిన వరద బాధితులు

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియడంతో మరోసారి వరద బాధితులు రోడ్డెక్కారు. అప్లికేషన్లతో మీ సేవా సెంటర్ల ముందు క్యూ కట్టారు. వరదలతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కోరారు బాధితులు. హైదరాబాద్ లో వరదలకు నష్టపోయిన వారికి రూ.10 వేల సహాయం అందించింది ప్రభుత్వం. కొందరికి ప్రత్యక్షంగా డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత మీ సేవా సెంటర్ల ద్వారా పంపిణీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరద సాయానికి బ్రేక్ పడింది. ఎలక్షన్స్ పూర్తయ్యాక ఖచ్చితంగా 10 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు కూడా రావడంతో మీ సేవా సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు బాధితులు.

మరోవైపు వరద సాయం కోసం బాధితులు మీ సేవా సెంటర్లకు రావాల్సిన అవసరం లేదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద సాయం అందని వివరాలను సేకరిస్తున్నాయని చెప్పారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరించుకొన్న తర్వాత నేరుగా అకౌంట్ లోకి డబ్బు వేస్తామని తెలిపారు.