
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. కృష్ణా నది బేసిన్ లోని ప్రాజెక్ట్‌లకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తోంది. ఈ క్రమంలో శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా సాగర్ కు మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 49,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 515.30 అడుగుల మేర నీరు ఉంది. కాగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు, ప్రస్తుతం140.8451 టీఎంసీలు నిల్వ ఉంది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి ఔట్‌ఫ్లో 900 క్యూసెక్కులు కొనసాగుతోంది.