ఫ్లవర్ షో ... పూల మకరందంతో నిండిపోయిన బొటానికల్ గార్డెన్

 ఫ్లవర్ షో ... పూల మకరందంతో నిండిపోయిన బొటానికల్ గార్డెన్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ షోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రారంభించారు. కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ షో ప్రారంభించడంతో వివిధ ఆకృతుల్లో ఉన్న పూల సోయగాన్ని ఎంజాయ్ చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ప్రదర్శనలో దివంగత నటులు రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్‌ల పుష్ప శిల్పాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే త్వరలోనే పునీత్ రాజ్ కుమార్ కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం ‘కర్ణాటక రత్న’ను ప్రదానం చేయనున్నట్లు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఫ్లవర్ షోను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. రాబోయే రోజుల్లో లక్షలాది మంది ఈ షోను సందర్శించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన పునీత్ రాజ్ కుమార్ , ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులు ఉన్న విగ్రహం వద్ద సెల్ఫీ స్పాట్ గా మారిపోయింది. అక్కడికొచ్చిన చాలా మంది పునీత్ విగ్రహం దగ్గర సెల్ఫీలు దిగుతూ.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు.