పెళ్లిళ్ల సీజన్ : పూలకు ఫుల్ డిమాండ్

పెళ్లిళ్ల సీజన్ : పూలకు ఫుల్ డిమాండ్

హైదరాబాద్ : సిటీలో ఫ్లవర్ మార్కెట్ లు జనంతో కిటకిటలాడుతున్నాయి.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫ్లవర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఈసారి వర్షాలు లేక పూల ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో పూల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్కెట్లో  పూలు కొనాలంటే ఆలోచిస్తున్నారు జనం. సిటీలో పూల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.  పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫ్లవర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పూల మార్కెట్లు కిట కిటలాడుతున్నాయి. మొన్నటి వరకు కేజీ 50 రూపాయలున్న చామంతి, బంతి ధర ఇప్పుడు 200 కు చేరింది. ఇక వెడ్డింగ్ డెకరేషన్ కోసం వాడే రోజ్, లిల్లి, జాస్మిన్ ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి.

విడి పూలతో పాటు దండల ధరలు కూడా రెండింతలు పెరిగాయి. దీంతో పాటు పెళ్ళి కూతురి ఫ్లవర్ జుయలరీకి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. గుడి మల్కాపూర్ లాంటి హోల్ సేల్ మార్కెట్లలోనే ధరలు ఈరేంజ్ లో ఉన్నాయంటే….  గల్లీలో మరింత ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనం.

ఈసారి వర్షాలు లేక పువ్వుల ఉత్పత్తి చాలా తక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. శుభకార్యాలు ఎక్కువగా ఉన్నా.. పెరిగిన ధరలతో..పూలు కొనడానికి జనం ఆలోచిన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కూడా రావడం లేదంటున్నారు వ్యాపారులు. వేసవిలో పండుగలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో పూలకు గిరాకీ బాగా పెరిగింది. కానీ దిగుమతులు ఉహించినంతగా లేవంటున్నారు వ్యాపారాలు.