రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి వివేక్ వెంకటస్వామి

సోమవారం ( ఆగస్టు 11 ) నాగర్ కర్నూల్ జిల్లా అచంపేట మండలంలో అంబెడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇళ్ల  నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని...  అంబేద్కర్ ని రోల్ మోడల్ తీసుకొని మన హక్కుల కోసం పోరాడాలని అన్నారు . 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కల్పించిన  రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని..రాజ్యాంగం ద్వారానే దేశం  ఆర్థికంగా ముందుకు వెళ్తోందని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే రాహుల్ గాంధీ ఎలక్షన్లలో బీజేపీ పై పోరాటం చేస్తున్నారని అన్నారు.  

ALSO READ : హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలూ తగ్గించం..

ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం దళితులకు, బీసీలకు అందరికీ మేలు చేస్తోందని అన్నారు మంత్రి వివేక్. నిరుపేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్లలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేటందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని... ఇందులో భాగంగా 10 వేల టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేసారని అన్నారు మంత్రి వివేక్.  

ఇందిరాగాంధీ వల్లనే నాడు పేదలకు అసైన్డ్ భూముల పట్టాలు ఇచ్చారని...  మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.