Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు తప్పిన ప్రమాదం

Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు తప్పిన ప్రమాదం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు ప్రమాదం తప్పింది. ఆయన  ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో (Chopper) సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్..  హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ గ్రౌండ్‌లో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధ పదార్ధాలు ఉండటంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. అనంతరం అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.