
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనపై ఎలాంటి విజన్, ప్రణాళిక లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క మాట మాట్లాడకపోవడం దురదృష్టకర మని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, మధ్యంత ర బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశ పరిచిందని ప్రియాంక ట్వీట్ చేశా రు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదంటూ ప్రియాంక విమర్శించారు.