
హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో బ్రేక్ ఫాస్ట్ కోసం సఫోలా మ్యూస్లీని విడుదల చేసింది. -కేసర్ క్రంచ్, బెర్రీ క్రంచ్, చాకో క్రంచ్ ఫ్లేవర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. చిరుధాన్యాలు, పండ్లు, కాయలు, గింజలతో వీటిని తయారు చేశామని తెలిపింది. వీటిలో మైదాగానీ, పామ్ఆయిల్గానీ వాడలేదని పేర్కొంది. 450 గ్రాముల ప్యాక్ ధర రూ.244.