
- స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ల డైరెక్షన్‌ను ద్రవ్యోల్బణ డేటా, వాణిజ్య వార్తలు, కార్పొరేట్ ఆదాయాలు, విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐల) కార్యకలాపాలు నడిపిస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా శుక్రవారం ఈక్విటీ మార్కెట్లకు సెలవు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌లు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి. ఆగస్టు 12న భారత్, అమెరికా, చైనా ద్రవ్యోల్బణ డేటా విడుదలవుతుంది. గ్లోబల్ ట్రేడ్ వార్ నడుస్తున్న ప్రస్తుత టైమ్‌లో ఈ డేటాపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. యూఎస్–-భారత వాణిజ్య చర్చలు, కంపెనీ జూన్ క్వార్టర్ ఫలితాలు మార్కెట్ డైరెక్షన్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఈ వారం అశోక్ లేలాండ్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, హిందాల్కో, బీపీసీఎల్ తమ క్యూ1 రిజల్ట్స్‌ను ప్రకటించనున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఆరో వారాన్ని నష్టాల్లో ముగించాయి. కిందటి వారం సెన్సెక్స్ 742.12 పాయింట్లు (0.92శాతం), నిఫ్టీ 202.05 పాయింట్లు (0.82శాతం) పడ్డాయి. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.18 వేల కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. టారిఫ్‌లపై ఒక క్లారిటీ వచ్చేంత వరకు మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. లోకల్ వినియోగంపై ఆధారపడే రంగాలపై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాలని సలహా
ఇస్తున్నారు.