కూకట్పల్లి, వెలుగు: మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఏఐ, రోబోటిక్స్ రంగాలపై దృష్టి కేంద్రీకరించి, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని రాష్ట్ర ఐటీ -మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా రెండో రోజు శనివారం జరిగిన గ్లోబల్ అలుమ్ని మీట్-2025ను ఆయన ప్రారంభించారు.
జేఎన్టీయూలో పరిశోధన, -అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలకు మార్గదర్శకంగా గ్లోబల్ అలుమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెక్టార్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, పూర్వవిద్యార్థుల సంఘ అధ్యక్షుడు విజయ్ మోహన్ రావు పాల్గొన్నారు.
