జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు.. రవాణాకు అంతరాయం..

జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు.. రవాణాకు అంతరాయం..

వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. రహదారి మొత్తం మంచుదుప్పటి కప్పేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. సంక్రాతి సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన వాహనదారులు.. పొగమంచు కారణంగా రహదారి కనబడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈరోజు(జనవరి 17) ఉదయం 8 వరకు పొగ మంచు తగ్గలేదు. దీనివల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండడంతో హెడ్ లైట్స్ వేసుకొని వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు.