Good News : మీరు పెట్టే ఫుడ్ లో ఏముందో బోర్డులు పెట్టండి

Good News : మీరు పెట్టే ఫుడ్ లో ఏముందో బోర్డులు పెట్టండి

రోజూ ఇంట్లో తిండి తిని బోర్ కొట్టడం వల్లనో, కొత్త కొత్త టేస్ట్ లు ట్రై చేయాలనో, లేక వీకెండ్స్ ఎంజాయ్ చేయాలన్న కారణంతోనో  మనం తరచూ బయట రెస్టారెంట్లలో తింటుంటాం. అయితే, కస్టమర్ల వీక్నెస్ ను క్యాష్ చేసుకునే ఆదేశంతో కొన్ని రెస్టారెంట్లు తమ కక్కుర్తి బుద్ది చూపిస్తుంటాయి. ఫుడ్ ఐటమ్స్ లో చీప్ క్వాలిటీ ప్రాడక్ట్స్ వాడి కస్టమర్లను దోచుకోవటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంటాయి. అయితే, ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం రెస్టారెంట్ల ఆగడాలకు చెక్ చెప్పే విధంగా ఉంది.

ఇకపై రెస్టారెంట్లలో కస్టమర్స్ కి సర్వ్ చేసే ఫుడ్ కోసం వాడిన ఇంగ్రిడియెన్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ యొక్క వివరాలు డిస్ప్లే చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10కి పైగా ఔట్లెట్స్ ఉన్న రెస్టారెంట్లు తాము సర్వ్ చేసే ఫుడ్ ఐటమ్స్ లో ఉండే పోషకాలకు సంబంధించిన డీటెయిల్స్ మెనూ కార్డ్స్ లో డిస్ప్లే చేయాలని ఆదేశించారు అధికారులు. ఈ రూల్స్ ఈ కామర్స్ కంపెనీలకు కూడా వర్తిస్తాయని తెలిపారు అధికారులు.