ఫుడ్ డెలివరీకి వచ్చి షూ కొట్టేసి, మెల్లగా జారుకున్నాడు..

ఫుడ్ డెలివరీకి వచ్చి షూ కొట్టేసి, మెల్లగా జారుకున్నాడు..

మారుతున్న మన లైఫ్ స్టైల్ కారణంగా ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిన లాభదాయకమైన బిజినెస్ ఫుడ్ డెలివరీ బిజినెస్. ఈ బిజినెస్ కి మంచి ఆదరణ లభించటంతో చాలా మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ గా ఉపాధి పొంది జీవనం సాగిస్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ బాయ్ జాబ్ చేస్తూనే చదువుకుంటూ గ్రూప్స్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఈ జాబ్ కి గౌరవాన్ని తెచ్చారు. మరో పక్క కొంత మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ చేతి వాటం చూపుతూ ఈ జాబ్ కి చెడ్డపేరు తెస్తున్నారు. గురుగ్రామ్ లో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం అని చెప్పచ్చు.

ఫుడ్ డెలివరీ కోసం వచ్చిన యువకుడు ఇంటి డోర్ వద్ద వెయిట్ చేసి కస్టమర్ రాగానే పార్సల్ ఇచ్చి, కస్టమర్ లోనికి వెళ్ళాక అటు, ఇటు చూసి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకొని ఇంటి బయట ఉన్న షూను తన తలకి చుట్టుకున్న టవల్ తో కప్పుకొని తీసుకెళ్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని ట్యాగ్ చేస్తూ సీసీ కెమెరా వీడియోను షేర్ చేశాడు కస్టమర్ . ఈ వీడియోకు స్పందించిన స్విగ్గీ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.