చెన్నూరులో కాకా వర్థంతికి అన్నదానం, దుప్పట్ల పంపిణీ

చెన్నూరులో కాకా వర్థంతికి అన్నదానం, దుప్పట్ల పంపిణీ

కార్మిక యోధుడు, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన గడ్డం వెంకటస్వామి కాకా 9వ వర్థంతిని పురస్కరించుకుని.. డిసెంబర్ 22వ తేదీన.. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్మికుల కోసం ఆయన నిరంతరం శ్రమించారని.. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన గొప్ప నేతగా కీర్తించారు కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ నా స్వప్నం అంటూ నిరంతరం పోరాడిని యోధుడుగా చెప్పుకొచ్చారు నేతలు. బడుగు, బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతికి.. వారి పిల్లల చదువు కోసం బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యా సంస్థలను నెలకొల్పి.. ఉచితంగా విద్యను అందించిన వ్యక్తి కాకా అని కొనియాడారు నేతలు. 

ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ  ఆస్పత్రిలో రోగులకు ఉచితం పండ్లు పంచిపెట్టారు. సత్యసాయి ట్రస్ట్ లోని వృద్ధులకు అన్నదానం చేశారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తానుగుల సతీష్, తానుగుల రవి, చెన్న వెంకటేష్, ఇతర నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.