నోరూరిస్తున్నయ్‌ : ఫుడ్‌ ఫెస్టివల్ లో టేస్టీ వంటకాలు

నోరూరిస్తున్నయ్‌ : ఫుడ్‌ ఫెస్టివల్ లో టేస్టీ వంటకాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ఫుడ్‌ ఫెస్టివల్‌ శనివారం ప్రారంభమైంది.  సంప్రదాయ పిండి వంటలు, స్పెషల్ నాన్‌వెజ్‌ వంటకాల రుచులను సందర్శకులు ఆస్వాదిస్తున్నారు. ఫెస్టివల్​ను టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎండీ బి.మనోహర్ లు హాజరై ప్రారంభించారు. స్టాల్స్ ని సందర్శించి వంటకాలను రుచి చూశారు. 3 రోజుల పాటు జరగనున్న ఫెస్టివల్ లో తెలంగాణ పిండి వంటలు నోరూరిస్తున్నాయి.

సర్వపిండి, గారెలు, అరిసెలు, గుడాలు, బజ్జీలు, గరిజెలు(కజ్జికాయలు), సకినాలు, నేతి అరిసెలు, వేడి వేడి జిలేబీ, పూతరేకులు, మిర్చి బజ్జీ, మసాలా అప్పడాలు, తెలంగాణలో ప్రత్యేకమైన పచ్చళ్లు, పొడులు, స్పెషల్ చికెన్ కబాబ్స్, బాంబూ చికెన్, కుల్ఫీల రుచికి సందర్శకులు ఫిదా అవుతున్నారు. దాదాపు 20 స్టాల్స్ ఉన్న ఫుడ్​ ఫెస్టివల్ లో తెలంగాణ పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.