
మార్కెట్ కు వెళ్తే చాలు.. ప్రతి వస్తువును కూడా ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఇంటికి తెచ్చుకుంటున్నాం.. దాన్ని అలానే ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కూరగాయల దగ్గర నుంచి..తినుబండారాల వరకు ఇదే పద్దతిని అవలంభిస్తున్నాం.. కాని ఇలా ప్లాస్టిక్‌సంచుల్లో లో నిల్వ చేయడం చాలా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వస్తువులను ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల వచ్చే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. . .
హైటెక్ యుగంలో జనాలకు ఎంత బద్దకం పెరిగిపోయిందంటే.. మార్కెట్ కు వెళ్లే టప్పుడు బ్యాగ్ తీసుకెళ్లలేకపోతున్నారు. సో ప్రపంచం అంతా ప్లాస్టిక్ మయం అయింది. ఇలా ప్లాస్టిక్ వాడకం.. ఆ సంచులతోనే ఫ్రిజ్ లో స్టోర్ చేయడం.. మన హెల్త్ ను మనమే కరాబు చేసుకోవడం .. ఇలా ప్రస్తుత జీవితం కొనసాగుతుంది.
NPJ సైన్స్ ఆఫ్ ఫుడ్ జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. ప్లాస్టిక్ కవర్లలో ఫుడ్ ఐటమ్స్ ను నిల్వ చేయడం వల్ల .. మైక్రో ప్లాస్టిక్.. నానో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో తేలింది. క్లోజ్డ్ ప్లాస్టిక్ కవర్స్ లో మైక్రోస్కోపిక్ ప్లాస్టిక్ శకలాలు విడుదల అయిన అందులో ఉన్న ఆహారం పదార్ధాలతో కరిగిపోతుంది.అలాంటివి పచ్చిగా తిన్నా... ఉడికించుకుని తిన్నా రక్తంలో కలిసి ఆరోగ్యంపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మైక్రోప్లాస్టిక్స్ ... ప్లాస్టిక్ ముక్కలు చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ప్లాస్టిక్ విచ్ఛిన్నం జరిగి ఏర్పడే మైక్రో ప్లాస్టిక్ ... ముక్కలు కంటికి కనపడవు. ఇవి ఆహారపదార్దాలతో కలిసిపోయి ఒక్కోసారి రసాయనక్రియ లాంటివి జరిగి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బ్రెడ్ .. ఇతర రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్‌లో ఇలాంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సహజంగా ఫ్రిజ్‌నుంచి వేస్ట్ వాటర్ బయటకు వెళ్తుంది. ప్లాస్టిక్ కవర్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వలన అలాంటి వేస్ట్ వాటర్ ద్వారా క్రిములు ఏర్పడి... Plastic Bags కు ఉన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి.. వాటిని చెడగొడుతుంది. అలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ముఖ్యమైన అవయవాలతో సహా శరీరం అంతటా వ్యాపించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. కొన్ని రకాల పరీక్షల నిర్వహించినప్పుడు.. రక్తం.. ఊపిరితిత్తులు.. మెదడులో అతి సూక్ష్మమైన మైక్రో ప్లాస్టిక్ ఉంది. టెస్ట్ చేసిన శాంపిల్స్ లో 80 శాతం మందికి బ్లడ్ లో ప్లాస్టిక్ ఉన్నట్లు నిర్దారించారు. మరొక నివేదికలో 58 శాతం మందికి ధమనుల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలున్నాయని.. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని తేలింది.
ప్లాస్టిక్ సంచుల్లో ఆహారపదార్దాలను ఫ్రిజ్ లో నిల్వ చేసిన ఆహారపదార్దాలను టెస్ట్ చేస్తే వాటిల్లో 96 శాతం మైక్రోప్లాస్టిక్ ను గుర్తించారు పరిశోధకులు. ప్లాస్టిక్ సమస్య మానవుల ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కార మార్గాలు...
- పండ్లు .. కూరగాయలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం మానేయాలి.
- మెష్ ... కాటన్ బ్యాగులు... స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు ... వెదురు బుట్టలతో తయారు చేసిన వాటిలో నిల్వ చేయండా. ఇవి కేవలం ఆరోగ్యమే కాదు పర్యావరణానికి చాలా అనుకూలమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- కూరగాయలను.. పండ్లను తక్కువ పరిమాణంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కోండి.
- మార్కెట్‌కు లేదా షాపింగ్ కు వెళ్లేటప్పడు మెష్ బ్యాగ్.. లేదా క్లాత్ సంచి తీసుకెళ్లండి.