తింటూనే బరువు తగ్గొచ్చు

తింటూనే బరువు తగ్గొచ్చు

పొట్ట కరిగించి బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. కానీ, దానికి చాలా కష్టపడాల్సి వస్తు్ంది. వ్యాయామాలు చేయాలి. ఆకలికి ఓర్చుకుంటూ డైట్ ఫాలో కావాలి. అయితే, కొన్ని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంతో పాటు పొట్టను కరిగించొచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. 

చాలామంది ఆలూ తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. కానీ, కొన్ని స్టడీలు ఆలూ తింటే బరువు తగ్గొచ్చని చెప్తున్నాయి. ఆలుగడ్డలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం కావడానికి సాయం చేస్తుంది. దాంతో ఈజీగా బరువు తగ్గుతారు. అయితే, ఉడకబెట్టిన ఆలుగడ్డలను మిరియాల పొడితో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిరియాల్లో పైపెరిన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. 

దాల్చిన చెక్క కూడా బరువు తగ్గడానికి ఒక మంచి ఉపాయం. అందుకే దాల్చిన చెక్కతో కాఫీ చేసుకొని తాగితే బరువు తగ్గొచ్చు. కాఫీ బీన్స్ లో కఫైన్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. 

ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్స్ సాయపడతాయి. ఇది పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ పండ్లు కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇందులో ఎటువంటి ఫ్యాట్ ఉండదు. కాబట్టి బరువు పెరిగే అవకాశం లేదు.