హోటల్లో ఫుడ్ పాయిజన్ 9 మందికి అస్వస్థత

హోటల్లో ఫుడ్ పాయిజన్ 9 మందికి అస్వస్థత

మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలోని అల్ వాడి హోటల్​లో మండి బిర్యాని తిని 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీఐ రమేశ్​నాయక్ వివరాల ప్రకారం.. టోలిచౌకి ప్రాంతానికి చెందిన కాలేద్ బిన్ అలీ కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ప్యారా మెంట్ కాలనీలోని అల్ వాడి హోటల్​లో మండి బిర్యానీ తిన్నారు. 

బిర్యానీ తిన్న వెంటనే 9 మందికి కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని కుటుంబ సభ్యులు కోరంటి హాస్పిటల్​కు తరలించారు. ఆదివారం కూడా విరేచనాలు తగ్గలేదు. ఇంకా చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.