గురుకులంలో ఫుడ్ పాయిజన్

గురుకులంలో ఫుడ్ పాయిజన్
  • 40 మంది విద్యార్థులకు అస్వస్థత

హవేలి ఘనపూర్‌‌‌‌ మండలకేంద్రం లోని మహాత్మాజ్యోతిబాపూలే బాలికలగురుకుల పాఠశాలలో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌తో 40 మంది స్టూడెంట్స్‌‌ ఆస్పత్రి పాలయ్యారు. ఈ స్కూళ్లో రెండు రోజుల్లో ఫుడ్‌‌పాయిజన్‌‌తో అస్వస్థు లు కావడం ఇది రెండవసారి. ఈ గురుకుల పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్‌‌‌‌ సోమవారం అస్వస్థతకు గురికాగా,మెదక్‌‌‌‌ జిల్లా అసుపత్రికి పంపారు. ఈ ఘటన తర్వాత కలెక్టర్‌‌‌‌ ధర్మారె డ్డి స్కూలుకు వెళ్లి ఫుడ్‌‌ విషయంలోజాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిం చారు. మంగళవారం మళ్లీ అదే పాఠశాలలో 40 మంది విద్యార్ థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని మెదక్‌‌‌‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 35 మందిని హాస్పిటల్‌ లో అడ్మిట్‌‌‌‌ చేసి సెలైన్‌‌ ఎక్కించారు. వీరిలో 22 మందిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌, డీఎంహెచ్‌ ఓ డాక్టర్‌‌‌‌ వెంకటేశ్వర్‌‌‌‌రావు, డీఐఓ డాక్టర్‌‌‌‌ నవీన్‌‌‌‌, పిల్లల వైద్య నిపుణులు చంద్రశేఖర్‌‌‌‌ అస్వస్థతకు గురైన స్టూ డెంట్స్‌‌‌‌ను పరీక్షించారు. జేసీ నగేష్‌‌, డీఆర్‌‌‌‌ఓ వెంకటేశ్వర్లు , బీసీడబ్ల్యుఓ సుధాకర్‌‌‌‌ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సోమ, మంగళవారం స్టూ డెంట్స్‌‌‌‌ అస్వస్థతతకు గురైన స్టూడెంట్స్‌‌కు పది మంది వైద్య సిబ్బందితో మెరుగైన వైద్య సేవలం దిస్తున్నట్టు జేసీ తెలిపారు. భోజనం, తాగునీటి పరిస్థితిపై విచారణ జరిపి వార్డెన్స్‌‌‌‌, ప్రిన్సి పల్‌ పై చర్యలు తీసుకుంటామని చెప్పా రు. పాఠశాలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యతను పరిక్షించాలని ఆర్‌‌‌‌డబ్ల్యుఎస్‌‌‌‌ అధికారులకు ఫోన్‌‌‌‌చేసి ఆదేశించారు. స్టూ డెంట్స్‌‌‌‌ పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురైనందున కలెక్టర్‌‌‌‌తో మాట్లాడి 3రోజులు సెలవు ఇచ్చేలా చూస్తామన్నారు.