ఫుడ్ పాయిజన్ ఘటనలో..ముగ్గురు వంట మనుషుల తొలగింపు

ఫుడ్ పాయిజన్ ఘటనలో..ముగ్గురు వంట మనుషుల తొలగింపు

హైదరాబాద్, వెలుగు: నిర్మల్​జిల్లాలోని నర్సాపూర్ కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వంట సమయంలో శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం చూపిన ముగ్గురు వంట మనుషులను విధుల నుంచి జిల్లా కలెక్టర్ తొలగించారని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

 కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్​కు షోకాజ్ నోటీసులిచ్చినట్టు చెప్పారు. జిల్లా జెండర్​ కోఆర్డినేటర్​గా ఉన్న జి. శ్రీదేవిని ఆమె సొంత డిపార్ట్​మెంట్​కు పంపించినట్టు తెలిపారు. ఆమె స్థానంలో సలోమీ కరుణను ఇన్​చార్జ్​గా నియమించినట్టు పేర్కొన్నారు.