ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్​లో ఫుడ్ పాయిజన్

ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్​లో ఫుడ్ పాయిజన్

 

  •     సిర్గాపూర్ లో అస్వస్థతకు గురైన ​ఇద్దరు స్టూడెంట్స్
  •     హాస్టల్ లో మెనూ పాటించడం  లేదని పేరెంట్స్ ఆందోళన

నారాయణ్ ఖేడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్  ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో మంగళవారం ఫుడ్ పాయిజన్ అయి ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ హాస్పిటల్ కు తరలివచ్చారు. అయితే, పిల్లల ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత హాస్టల్​కు వెళ్లి ప్రిన్సిపాల్​తో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైతే కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. మెనూ పాటించడం లేదని ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ హాస్టల్​లో మెనూ ప్రకారం క్వాలిటీ భోజనం పెట్టట్లేదని, అందుకే పిల్లలు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. అధికారులు స్పందించి డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.