గురుకుల కాలేజీలో 15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్

గురుకుల కాలేజీలో 15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్

సంగారెడ్డి జిల్లా బుదేరా మహిళా డిగ్రీ గురుకుల కాలేజీలో  15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఏప్రిల్ 28న ఓ విద్యార్థిని బర్త్ డే ఉండటంతో   ఆమె తల్లిదండ్రులు పాయాసం తీసుకొచ్చారు.   15 మంది విద్యార్థులు  రాత్రి పాయాసం తాగారు.  ఇవాళ ఉదయం లేవగానే  వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గరయ్యారు.  దీంతో విద్యార్థినీలను మునిపల్లి పీహెచ్ సీలో ప్రాథమిక చికిత్స చేసి సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం 15 మంది విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.  వీరిలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే హాస్టల్ లో రోజు పెట్టే ఆహారంతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

2023 ఏప్రిల్ 7 న  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ మైనారిటీ గురుకులంలో పురుగుల అన్నం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా ఏదో ఒక చోట గత ఐదేళ్లలో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. అయితే  ఫుడ్​ పాయిజనింగ్ కేసులు ఒక్కటీ లేవని.. ఆర్టీఐ అప్లికేషన్​కు గురుకుల విద్యాసంస్థలు రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే..