భీంపూర్ KGVBలో... 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

భీంపూర్ KGVBలో... 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో భోజనం అంటే భయంతో వణికిపోతున్నారు విద్యార్థులు. వరుసగా స్కూళ్లు, KGVB ల్లో ఫుడ్ పాయిజన్ అవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. 4, 5 రోజులుగా ఏదో ఒక చోట ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ KGVB లో... 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆదిలాబాద్ KGVB లో వరుసగా రెండు రోజులు ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టళ్లో భోజనం చేసిన 60 మందికి పైగా విద్యార్థులకు వాంతులు అయ్యాయి. వారం క్రితం గోట్కూరి ప్రభుత్వ పాఠశాలలో 28 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇక బాసర త్రిబుల్ ఐటీలో రోజూ ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పురుగుల అన్నం, సాంబార్లో కప్పలు వచ్చాయని చెప్తున్నారు విద్యార్థులు. స్కూళ్లు, హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు పేరంట్స్. 

 

. అదనపు కలెక్టర్ రీజ్వా న్ బాషా షేక్, డీ.ఎం.హెచ్.ఓ నరేందర్ రాథోడ్, డీ.ఈ.ఓ ప్రణీత తదితరులు పాఠశాల తో పాటు రిమ్స్ లో పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు గల కారణాలపై స్ధానిక అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇటీవల మరమ్మతు చేసిన బోర్ వెల్ కు పైన కవర్ వేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బోర్ వెల్ వద్ద ఎటువంటి రక్షణ కవచం లేకపోవడంతో నీరు కలుషితమై విద్యార్థులు అస్వస్థత కు గురైనట్లు భావిస్తూ ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. ఇక ఇటువంటి ఘటనలు పునరవృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, విచారణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.