అంగన్వాడీలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

అంగన్వాడీలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

అంగన్ వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకొని ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని లైన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్ వాడిలో అదే తండాకు చెందిన చిన్నారులు జశ్వంత్( 4), శాన్వి (4), జగదీష్ (5) లకు ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. జశ్వంత్ అనే విద్యార్థి పరిస్థితి విషయంగా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. శాన్వి (4), జగదీష్ (5) విద్యార్థులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలకు ఇచ్చిన ఆహారం వల్లనే ఆస్వస్థతకు గురైయినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. టీచర్ల నిర్లక్ష్యంపై పిల్లలు  తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.