కలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థులకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థులకు అస్వస్థత

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వికారాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు..

విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని..లక్షలు చెల్లించి తమ బిడ్డలను చేర్పిస్తే ఇలా జరగడమేంటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అస్వస్థతకు గురైన విద్యార్థులను విద్యాశాఖాధికారి రేణుకా దేవి పరామర్శించారు.