బిగ్ షాక్ : హైదరాబాద్‪లోని బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. వణికిపోతున్న నిర్వాహకులు

బిగ్ షాక్ : హైదరాబాద్‪లోని బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. వణికిపోతున్న నిర్వాహకులు

హైదరాబాద్ లో హాస్టల్స్.. పీజీల్లో లక్షల మంది ఉంటున్నారు.. సిటీ వ్యాప్తంగా వేలాది హాస్టల్స్ ఉన్నాయి.. హైటెక్ సిటీ నుంచి అమీర్ పేట వరకు ప్రతి గల్లీలో ఓ హాస్టల్ కనిపిస్తుంది. స్టూడెంట్స్, ఉద్యోగాలు చేసే సింగిల్స్.. ఉద్యోగ వేటలో ఉండే నిరుద్యోగులు.. కోర్సులు నేర్చుకునే విద్యార్థులు.. ఇలా బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ వేలాది ఉన్నాయి. ఈ హాస్టల్స్ లో లక్షల మంది ఉంటున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రికి డిన్నర్ ఇలా.. ప్రతి హాస్టల్ లో కిచెన్ ఉంటుంది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

దీంతో హాస్టల్ నిర్వాహకులు వణికిపోతున్నారు. ఇటీవల వరుసగా హోటల్స్ పై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పడు హాస్టల్స్, పీజీలపై పడ్డారు. ఈక్రమంలో జూన్ 16 (ఆదివారం) హైదరాబాద్ సిటీలోని పలు హాస్టల్స్ పై దాడులు చేశారు. వంట గదుల్లో కుల్లిపోయిన కూరగాయలు, ఎక్స్ పైయిరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు అక్కడ దర్శనమిచ్చాయి. తుప్పు పట్టిన దోసె పాన్, ఓపెన్ డ్రైనేజీ, చెత్త నిల్వ చేసే వాష్ ఏరియాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.  ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ సూపర్‌వైజర్ హాస్టల్ లో లేరని యాజమాన్యంపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావేరి హిల్స్ లోని శ్రీలక్ష్మీ హాస్టల్ గడువు దాటిన వంట పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మాదాపూర్‌లోని వీజీ హోమ్‌స్టే , నారాయణ మెడికల్ అకాడమీలో లైసెన్స్  లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్నారని తేలింది. ఎక్స్ పైయిరీ డేడ్ అయిపోయిన వైట్ గ్రేవీ (2 కిలోలు), చాప్ మసాలా (2 కిలోలు) హాస్టల్స్ లో స్వాధీనం చేసుకున్నారు. కల్తీ జరిగిందనే అనుమానంతో లూస్ కారం, పప్పుల శాంపిల్స్ తీసుకెళ్లారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అక్కడే టెస్ట్ చేశారు. అల్లం, టమాటో సాస్, బియ్యం, పప్పులు సరిగా నిల్వ చేయడం లేదని అధికారులు హాస్టల్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారు.