
హోటల్స్ యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు అనటానికి ఇంతకు మించిన సాక్ష్యం ఉండదేమో. తినేది మనం కాదుకదా.. అన్న ధోరణిలో దారుణంగా భోజన ప్రియులను మోసం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని హోటళ్లలో సోదాలు చేసినా.. ఎన్నింటిని సీజ్ చేసినా.. మనం అయితే ఇప్పటి వరకు సేఫ్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన తనిఖీళ్లో హోటళ్ల మెయింటెనెన్స్ చూసీ అధికారులు షాక్ కు గురయ్యారు.
వేములవాడ పట్టణంలో పలు హోటళ్లు, రెస్టారెంట్ లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం (ఆగస్టు 01) స్టేట్ ఫుడ్ కంట్రోలర్ టాస్క్ ఫోర్స్ అధికారి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. తాజ్ హోటల్లో కుళ్ళిన పదార్థాలు, నాణ్యత లేని ఆహార వస్తువులు లభ్యం అయ్యాయి. పెద్ద ఎత్తున నాణ్యత లేని పదార్థాలు సీజ్ చేశారు.
పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుద్ధత, నాణ్యత స్ధాయిలపై దాడులు చేసిన అధికారులు హోటల్స్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు పూర్తయిన (ఎక్స్ పైరీ) వస్తులను వాడుతున్నట్లు గుర్తించారు. వంటగదులు పరిశుభ్రంగా ఉండటంపై సీరియస్ అయ్యారు.