
పిజ్జా అంటే ఇష్టపడని వారుండరేమో.. దిబ్బరొట్టెపై (కేక్ ప) ఫుల్లుగా చీజ్, బటర్ దట్టించి పచ్చి కూరగాయల ముక్కలు.. మసాలా, స్పైసెస్ తో.. అద్భుతమైన వాసనతో చూస్తే తినేయాలనిపించేలా ఆకర్శిస్తుంది. కస్టమర్స్ అభిరుచిని బట్టి వెజ్, నాన్ వెజ్ పిజ్జాలు ఆర్డర్ వేసిన ఫైవ్ మినిట్స్ లో వేడివేడిగా సర్వ్ చేస్తుంటారు. ఈ తరం యూత్ అయితే వారంలో ఒకసారైనా పిజ్జా తినాల్సిందే అనే పట్టుదలతో ఉంటుంటారు. డోమినోస్ పిజ్జా, పిజ్జా హట్ మొదలైన బ్రాండెడ్ పిజ్జాలతో పాటు లోకల్ పిజ్జాలు 24 హవర్స్ అందుబాటులో ఉంటున్నాయి.
జనాల్లో పెరుగుతున్న ఆసక్తితో పిజ్జా సెంటర్లు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెరిగిపోయాయి. అయితే పిజ్జాలంటే లొట్టలేసుకుతినే వాళ్లు.. ఈ వార్త వింటే అసలు తినాలా వద్దా అనే డైలెమాలో పడకమానరు.
మంగళవారం (సెప్టెంబర్ 23) ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా పిజ్జా సెంటర్లపై రైడ్స్ చేశారు. కిచెన్స్ మెయింటెనెన్స్ చూసి షాకయ్యారు. మొత్తం 55 పిజ్జా సెంటర్లలో నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడా శుచీ శుభ్రతా లేదని.. కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు.
నిబంధనలు పాటించని పిజ్జా హట్స్ సెంటర్లు:
హైదరాబాద్ లో ఇంత దారుణంగానా..
మంగళవారం మొత్తం 18 పిజ్జా హట్స్ ఔట్ లెట్లలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఎక్కడా పాటించడంల లేదని గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. లైసెన్స్ లేకపోయినా.. మేనేజ్ చేస్తూ నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట స్టోర్ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు సేఫ్టీ మెజర్స్ ఎక్కడా పాటించడం లేదని చెప్పారు.
రెస్ట్ ఆఫ్ తెలంగాణలో..
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా పిజ్జా హట్స్ సెంటర్ల పరిస్థితి ఇలాగే ఉంది. హనుమకొండ జిల్లాలోని కాజీపేట ఏరియాలో పిజ్జా తయారీకి వాడే మెషీన్లు చాలా దారుణంగా.. దుర్గంద్ధం వస్తూ కనిపించాయని చెప్పారు.
వరంగల్ లోని పిజ్జా హట్ ఔట్ లెట్ లో సేఫ్టీ సర్టిఫెకెట్ లేకుండానే నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఫ్రీజర్ టెంపరేచర్ సరిగా మెయింటైన్ చేయడం లేదని.. ఫుడ్ తయారీకి వాడే పనిముట్లు చండాలంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
నల్గొండ ఔట్లెట్ లో డస్ట్ బిన్ లలో కాలం చెల్లిన సాస్ బాటిల్స్.. డబ్బాలు గుర్తించారు. అంటే ఎక్స్ పైరీ అయిన వాటిని వాడుతున్నట్లు నిర్ధారించారు. తెలంగాణ వ్యాప్తంగా పిజ్జా హట్ ఔట్ లెట్స్ సేఫ్టీ మెజర్స్ ను చూపించలేకపోయినట్లు చెప్పారు.
డామినోస్ పిజ్జా ఔట్ లెట్స్ ఇంత ఘోరంగానా.
మరో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన డోమినోస్ పిజ్జా ఔట్ లెట్స్ కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. తింటే తింటారు.. చస్తే చస్తారు అన్నట్లుగా కస్టమర్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మెయింటైన్ చేస్తున్నట్లు గుర్తించారు.
నిజామాబాద్ డోమినోస్ ఔట్ లెట్ లో చీమలు, బొద్దింకలతో దరిద్రంగా కిచెన్ పరిసరాలు ఉన్నట్లు గుర్తించారు. వర్కర్స్ గ్లోవ్స్, మాస్కులు లేకుండా.. నీట్ నెట్ పాటించకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు.
►ALSO READ | ICICI బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..? అక్టోబర్ నుంచి వస్తున్న కొత్త రూల్ తెలుసా?
హనుమకొండ సుబేదారి ఏరియాలో ఉన్న సెంటర్ లో.. పిజ్జా తయారు చేసే పనిముట్లకు దాదాపు ఇంచు మందం మాడు, మసి, మురికి పట్టి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు అధికారులు. చాలా రోజులుగా వాటి శుభ్రం చేసిన పాపాన పోయి ఉండరని గుర్తించారు.
మరోవైపు వరంగల్ పిజ్జా ఔట్ లెట్ లో.. వర్కర్స్ కు ఎలాంటి పరీక్షలు లేకుండానే మెడికల్ రికార్డ్స్ ఇష్యూ చేసి పనిచేయించుకుంటున్నట్లు గుర్తించారు.
ఇక మహబూబ్ నగర్ ఔట్ లెట్ లో వెజ్, నాన్ వెజ్ ఫుడ్ అంతా ఒకే చోట స్టోర్ చేయడం ఆందోళన కలిగించే అంశం.
ఇతర పిజ్జా సెంటర్లు పరిస్థితి ఇది..
డోమినోస్, పిజ్జా హట్ కాకుండా ఇతర పిజ్జా సెంటర్లలో కూడా పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్లు గుర్తించారు. లైసెన్స్ డిస్ప్లే లేకుండా.. మెడికల్ సర్టిఫికేట్ లేకుండా నడుపుతున్నారని అధికారులు తెలిపారు. పిజ్జా పారడైజ్ లో వాడిన నూనెనే మళ్లీ వాడటం, పనీర్, బ్రెడ్, పొటాటో చిప్స్ బూజు పట్టాయని.. ఓవెన్స్ తుప్పు పట్టి ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ లో పురుగులు, బొద్దింకలు దర్శనం ఇచ్చినట్లు చెప్పారు.
కోకపేట్, నార్సింగిలోని లా పినోజ్ పిజ్జా సెంటర్ కిచెన్ మురికి కూపంలా కనిపించినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని పిజ్జా కార్నర్ లో.. కుళ్లిపోయిన కూరగాలు, డబ్బాల కొద్దీ వాడిన నూనె వినియోగిస్తున్నట్లు గుర్తించారు.