
మేడిపల్లి, వెలుగు: గ్రేటర్‌పరిధిలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్దేవేందర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పై రైడ్ చేశారు.
రెస్టారెంట్ఫ్రిడ్జ్లో కుళ్లిన చికెన్, పాచిపోయిన చేపలు, ఇతర మాంస పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని ల్యాబ్ కు పంపించారు. రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్‌సేఫ్టీ అధికారులు తెలిపారు.