ప్రముఖ ఫుడ్ యూట్యూబర్ అనుమానాస్పద మృతి

ప్రముఖ ఫుడ్ యూట్యూబర్ అనుమానాస్పద మృతి

కొచ్చికి చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ రాహుల్ కుట్టి 2023 నవంబర్ 04 శనివారం  రోజున  తన నివాసంలో శవమై కనిపించాడు.  ప్రస్తుతం అతని వయసు 33 ఏళ్లు. రాహుల్ తల్లిదండ్రులు,  స్నేహితులు అతని బెడ్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  అయితే అతను అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

కాగా  రాహుల్ ‘ఈట్ కొచ్చి ఈట్’ పేరుతో కొచ్చిలోని ప్రముఖ ఫుడ్‌ని పరిచయం చేస్తుంటాడు.  తినుబండారాల కోసం ప్రసిద్ధ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంగా ఉంది. ఈ పేజీకి 4.21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రాహుల్ కు భార్య, రెండేళ్ల కొడుకు ఉన్నారు.