ఎనర్జీ ఫుడ్ : ఉదయాన్నే ఉత్సాహం రావాలంటే ఇవి తినండి.. తాగండి

ఎనర్జీ ఫుడ్ : ఉదయాన్నే ఉత్సాహం రావాలంటే ఇవి తినండి.. తాగండి

ప్రకృతి మాత మనకు సమృద్ధిగా పండ్లు, కూరగాయలు, గింజలు, సుగంధ ద్రవ్యాలను బహుమతిగా ఇచ్చినందుకు మనం నిజంగా చాలా అదృష్టవంతులం. సరైన ఆహారాన్ని ఎంచుకోవడం వ్యాధులను దూరంగా ఉంచడానికి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. మనం తినే ఆహారాలకు మన శరీరాన్ని నయం చేసే లేదా నాశనం చేసే శక్తి ఉంటుంది. అవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, మన శక్తి స్థాయిలను పెంచుతాయి. ఉదయాన్నే మన సిస్టమ్‌ను మరింత ఉత్సాహంగా చేయగలవు. హోలిస్టిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్, యోగా గురువు డాక్టర్ మిక్కీ మెహతా.. ఉదయం పూట మీ శక్తిని పెంచడంలో సహాయపడే తినవలసిన ఆహారాలను సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం:

  • నిమ్మకాయలతో రోజును ప్రారంభించాలి. ఇది శరీరాన్ని ఆల్కలీన్‌గా ఉంచడానికి, జీర్ణక్రియకు, బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఈ నిమ్మకాయ.. చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  • దానిమ్మ వంటి తాజా సీజనల్ పండ్లు పలు ఆరోగ్య ప్రయోజనాలనిస్తాయి. అవి చాలా తక్కువ క్యాలరీలను, అధిక ఫైబర్‌లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ప్యూరిఫైయర్‌లుగా పనిచేస్తాయి, మన శరీరాలను శుభ్రపరుస్తాయి. పండ్లలోని తీపి మన చక్కెర కోరికలను కూడా తగ్గిస్తుంది. ఇందులోనని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మలో యాంటీఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి సహజమైన గులాబీ రంగును అందిస్తాయి, కణాల పునరుత్పత్తిపై పని చేస్తాయి. అవి విటమిన్లు, మినరల్స్.. శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
  • ఖర్జూరాలు లేదా ఎండుద్రాక్షలు, వాల్‌నట్‌లు లేదా క్రాన్‌బెర్రీస్ లేదా ఆప్రికాట్లు, నువ్వులు, బాదంపప్పుల వంటి గింజలు, విత్తనాలు తక్షణ శక్తిని పెంచుతాయి. అవి మైక్రో మినరల్స్, న్యూట్రీషియన్స్‌తో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో ఫోర్టిఫైయర్‌లుగా, రెగ్యులేటర్‌లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా PCOS/PCOD లేదా థైరాయిడ్ తో బాధపడుతున్న మహిళల్లో హార్మోన్లను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
  • ఒక రోజులో కొన్ని గింజలు (బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు మొదలైనవి) లాంటి విత్తనాలను కలిపి (అవిసె గింజలు, చియా, పొద్దుతిరుగుడు, నువ్వులు, గుమ్మడికాయ, పుచ్చకాయ మొదలైనవి) తినడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోర్లు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం, లిపిడ్ స్థాయిల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తాయి. ఇవి చిన్న ఆహారాలే అయినప్పటికీ పుష్కలమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అన్ని అవసరమైన ప్రయోజనకరమైన పోషకాలను అందిస్తాయి.

ఈ ఆహారాలు వ్యాధుల నుండి కోలుకోవడానికి శక్తిని ఇవ్వడమే కాకుండా దెబ్బతిన్న శరీర కణజాలాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయి. అవి దీర్ఘాయువును పెంచుతాయి. కావున ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోండి.. జంక్ ఫుడ్ ను దూరం చేసుకోండి.