V6 News

హైదరాబాద్‌లో 'మెస్సీ మేనియా': డిసెంబర్ 13న GOAT టూర్.. వేగంగా టికెట్ బుకింగ్స్

హైదరాబాద్‌లో 'మెస్సీ మేనియా': డిసెంబర్ 13న GOAT టూర్.. వేగంగా టికెట్ బుకింగ్స్

Messi GOAT Tour: ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ(Lionel Messi) 'GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌ నగరానికి వస్తున్నారు. డిసెంబర్ 13, 2025న ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఈవెంట్ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ పర్యటనను ఇప్పటికే ధృవీకరించారు. 

మేస్సీ భారత పర్యటన లిస్టులో కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌ను చేర్చడం దక్షిణాదితో పాటు తెలుగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇది కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్ మాత్రమే కాదు.. మేస్సీ మాస్టర్‌క్లాస్, యువ క్రీడాకారుల కోసం ఫుట్‌బాల్ క్లినిక్, సెలబ్రిటీల మ్యాచ్, మ్యూజికల్ షో, సన్మాన కార్యక్రమంతో కూడిన ఒక భారీ స్పోర్ట్స్ ఈవెంట్ కానుంది.

ముఖ్యమంత్రితో ఫ్రెండ్లీ మ్యాచ్: 
మెస్సీ పర్యటనలో ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం, చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తోంది సీఎం రేవంత్ రెడ్డితో ఆట గురించే. దీంతో ఇప్పుడు మేస్సీ, సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ 'RR 9' జెర్సీ ధరించనుండగా.. మేస్సీ 'LM 10' జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 

Also read:- మెస్సీ - గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ కి పాస్ లేకుంటే నో ఎంట్రీ... రాచకొండ సీపీ సుధీర్ బాబు

టికెట్లకు భారీ డిమాండ్: 
మేస్సీ ఈవెంట్ టికెట్లను 'DISTRICT by Zomato' యాప్ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. చివరి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మేస్సీ అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున టికెట్ ధరలు రూ. 2వేల 500 నుంచి స్టార్ట్ చేయబడ్డాయి. మేస్సీ పర్యటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం హైదరాబాదులో దొరుకుతుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.  

టికెట్ బుక్కింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Book Lionel Messi G.O.A.T India Tour 2025 Hyderabad Tickets