సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. మంగళవారం (డిసెంబర్ 9) కటక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 101 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో బుమ్రా వేసిన ఒక డెలివరీ వివాదాస్పదమవుతోంది. సౌతాఫ్రికా ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 11 ఓవర్ రెండో బంతిని బుమ్రా ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరాడు. డెవాల్డ్ బ్రేవీస్ షాట్ ఆడడంతో టైమింగ్ మిస్ అయ్యి బాల్ అక్కడే గాల్లోకి లేచింది. సూర్య కవర్స్ లో ఈజీ క్యాచ్ అందికోవడంతో బ్రేవీస్ 22 పరుగుల వద్ద ఔటయ్యాడు.
బుమ్రా టీ20 కెరీర్ లో ఇది 100 వ వికెట్ కావడం విశేషం. బుమ్రా పాదం క్రీజ్ కు దగ్గరగా ఉండడంతో అంపైర్లు అంపైర్లు ఫ్రంట్-ఫుట్ నో-బాల్ చెక్ చేశారు. చాలా సేపు చెక్ చేసిన తర్వాత బుమ్రా పాదం లైన్ మీదనే ఉందని.. అది 'ఫెయిర్ డెలివరీ' అంటూ అంపైర్లు బ్రేవీస్ ను ఔట్ అని ప్రకటించారు. అయితే కొన్ని యాంగిల్స్ లో మాత్రం బుమ్రా లైన్ దాటుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో బుమ్రా వేసింది నో బాల్ అంటూ.. ఈ విషయంలో సౌతాఫ్రికాకు అన్యాయం జరిగిందంటూ నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. థర్డ్ అంపైర్ సరిగా చూడలేదని.. అన్ని యాంగిల్స్ లో చూస్తే నాటౌట్ ఇచ్చేవారని సఫారీలపై జాలి చూపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌కు ముందు 99 వికెట్లతో ఉన్న బుమ్రా.. బ్రెవిస్‌ను ఔట్ చేసి వందో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు. ఓవరాల్ గా చూసుకుంటే బుమ్రా కంటే ముందు టిమ్ సౌతీ, లసిత్ మలింగ, షకీబ్ అల్ హసన్, షహీన్ షా అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల ఫీట్ సాధించారు. తాజాగా బుమ్రా వీరి సరసన చేరాడు. టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ బుమ్రా కంటే ముందే భారత తరుఫున అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ALSO READ : ర్యాంకింగ్స్‌లో రోకో రూలింగ్: రోహిత్‌కు అగ్ర స్థానం.. రెండో స్థానంలో కోహ్లీ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) ముగిసిన ఈ మ్యాచ్ లో సఫారీలను చిత్తు చేస్తూ 101 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. మొదట బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్య (28 బంతుల్లో 59: 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో పాటు బౌలర్లు దుమ్ములేపి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్య, దూబేలకు తలో వికెట్ దక్కింది.
Boom boom, Bumrah! 🤩😎
— Star Sports (@StarSportsIndia) December 9, 2025
Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L

