టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. 35 ఏళ్ళ వయసు దాటినా 50 ఓవర్ల ఫార్మాట్ లో తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. రిటైర్మెంట్ వార్తల నుంచి వన్డేల్లో రూలింగ్ చేస్తూ ఆధిపత్యం చూపిస్తున్నారు. లేటెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ అగ్ర స్థానంలో ఉంటే.. విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం (డిసెంబర్ 10) ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ రోహిత్ 781 రేటింగ్ పాయింట్స్ తో టాప్ లో ఉంటే.. కోహ్లీ 773 రేటింగ్ పాయింట్స్ రెండో స్థానంలో ఉన్నాడు.
కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య కేవలం 8 రేటింగ్ పాయింట్స్ మాత్రమే తేడా ఉండడం విశేషం. వీరిద్దరూ 2026 జనవరిలో న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ లో బాగా ఆడితే కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు చేస్తే.. కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్ కు ముందు నాలుగో స్థానంలో ఉన్న విరాట్.. తన అసాధారణ బ్యాటింగ్ తో రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.
Also read:- IPL 2026 వేలం తుది జాబితాలో బిగ్ ఛేంజస్.. ఆక్షన్‌లోకి మరో 9 మంది ప్లేయర్లు ఎంట్రీ
సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ విఫలమై ఉంటే.. కోహ్లీ అగ్రస్థానంలో ఉండేవాడు. అయితే మూడో వన్డేలో రోహిత్ తో పాటు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ మూడో స్థానంలో.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం జాద్రాన్ నాలుగో స్థానంలో నిలిచారు. 723 రేటింగ్ పాయింట్లతో గిల్ ఐదో స్థానానికి పడిపోయాడు. శ్రేయాస్ అయ్యర్ 10 స్థానానికి పడిపోయాడు. బాబర్ అజామ్, హ్యారీ టెక్టార్, షై హోప్, చరిత్ అసలంక వరుసగా 6,7,8,9 స్థానంలో నిలిచారు. టాప్ -10 ర్యాంకింగ్స్ లో టీమిండియా నుంచి నలుగురు ప్లేయర్స్ ఉండడం విశేషం.
Virat Kohli rises two places to second in the latest ODI batting rankings 📈
— ESPNcricinfo (@ESPNcricinfo) December 10, 2025
Ro-Ko on top together 🤝 pic.twitter.com/4avTvS1M8b

