సౌత్ కొరియా కార్ల కంపెనీ కియా కంపెనీ కొత్త జనరేషన్ సెల్టోస్ SUVని ఇండియాలో పరిచయం చేసింది. ఈ అప్‌డేట్ అయిన ఎస్‌యూవీ మరింత స్టైలిష్‌గా, పెద్ద సైజులో, చాలా కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది. కొత్త సెల్టోస్ ఇప్పుడు పొడవుగా, వెడల్పుగా ఉండటంతో పాటు వీల్‌బేస్ అంటే రెండు చక్రాల మధ్య దూరం కూడా కూడా పెరిగింది.
ఈసారి రెండు కొత్త కలర్స్ తో సహా మొత్తం 10 సింగిల్-టోన్ కలర్స్ లో లభిస్తుంది. అలాగే HTE, HTK, HTX, GTX అనే నాలుగు బేస్ ట్రిమ్‌లలో వస్తుంది. ఈరోజు రాత్రి నుండి రూ. 25 వేలు కట్టి బుకింగ్‌లు చేసుకోవచ్చు. జనవరి మధ్య నుండి డెలివరీలు స్టార్ట్ అవుతాయి. జనవరి 2న కంపెనీ దీని ఫైనల్ ధరలను ప్రకటిస్తుంది.
నెక్స్ట్-జెన్ కియా సెల్టోస్: ఎక్స్‌టీరియర్
కొత్త కియా సెల్టోస్ సైజు ఇప్పుడు 95mm పొడవు, 30mm ఎక్కువ వెడల్పు, వీల్‌బేస్ కూడా 80mm పెరిగింది. బయటి డిజైన్‌లో డిజిటల్ టైగర్ ఫేస్ అని పిలిచే కొత్త ఫ్రంట్ డిజైన్, గన్‌మెటల్ కలర్ తో బ్లాక్ హై-గ్లోస్ గ్రిల్, డైనమిక్ వెల్కమ్ ఫంక్షన్‌తో ఐస్ క్యూబ్ LED హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో పాటు స్టార్ మ్యాప్ LED DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్లు), LED ఫాగ్ ల్యాంప్స్, వెనుక భాగంలో స్టార్ మ్యాప్ LED కనెక్ట్ టెయిల్‌ల్యాంప్‌లు, బ్యాక్ వైపర్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ బ్యాక్ స్పాయిలర్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్‌గా బయటకు వచ్చే డోర్ హ్యాండిల్స్ ఉంటాయి.
Also read:- టెస్టింగ్‌లో కొత్త మోడల్.. కొత్త లుక్, లేటెస్ట్ ఫీచర్లతో లాంచ్..
ఇంటీరియర్:
కొత్త సెల్టోస్ ఇంటీరియర్ చూస్తే లోపలి భాగంలో స్కై-బ్లాక్ & వైట్ అనే డ్యూయల్ కలర్ థీమ్‌తో లెథరెట్ సీట్లు, 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టెంపరేచర్ కంట్రోల్స్ అన్నీ ఇందులో కలిసి ఉంటాయి. 10 విధాలుగా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, పవర్ లంబర్ సపోర్ట్, ORVM (సైడ్ మిర్రర్) సెట్టింగ్‌లతో కలిపిన మెమరీ ఫంక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డబుల్ డి-కట్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జర్, 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, 60:40 రేషియోలో బ్యాక్ సీట్లు, రిక్లైన్ అడ్జస్ట్, సన్ షేడ్ కర్టెన్లు, ముందు ఇంకా వెనుక రెండు చోట్లా టైప్-C USB పోర్ట్‌లు, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ చూడవచ్చు.
సేఫ్టీ అండ్ టెక్నాలజీ:
కొత్త సెల్టోస్ సేఫ్టీ, టెక్నాలజీ ఫీచర్లను బాగా పెంచింది. 6 ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రోల్-ఓవర్ సెన్సార్, అన్ని టైర్లకు డిస్క్ బ్రేక్‌లు, ఆటో లైట్ కంట్రోల్, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, నావిగేషన్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ జోన్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి 28 అటానమస్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
స్మార్ట్ కీ అంటే కారు దగ్గరగా వెళ్తే అన్‌లాక్ అయ్యే ఫంక్షన్, విండ్‌షీల్డ్ ప్రొజెక్షన్ హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఈ కారు 91 కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వస్తుంది. కొన్న తర్వాత కూడా ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లకు సపోర్ట్ చేస్తుంది.
ఇంజన్ ఆప్షన్స్: కొత్త కియా సెల్టోస్ "స్మార్ట్‌స్ట్రీమ్ లైనప్" అని పిలువబడే మూడు ఇంజన్ అప్షన్లో వస్తుంది. స్మార్ట్‌స్ట్రీమ్ G1.5 (పెట్రోల్) ఇంజన్ 115 ps పవర్, 144 nm టార్క్ ఉత్పత్తి చేస్తుండగా, స్మార్ట్‌స్ట్రీమ్ G1.5 T-GDI (టర్బో-పెట్రోల్) ఇంజన్ 160 పిఎస్, 253 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, D1.5 (డీజిల్)116 ps పవర్, 250nm ఉత్పత్తి చేస్తుంది.

