జపాన్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి కార్ల మోడళ్లను మార్కెట్‌లో పోటీకి తగ్గట్టుగా అప్‌డేట్ చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇప్పుడు బ్రెజ్జా కారుకు కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రెడీ చేస్తోంది. ప్రస్తుత మోడల్ 2022లో విడుదలైన తర్వాత ఇప్పుడు పెద్ద అప్‌డేట్ రాబోతుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో కారు స్టైల్, ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కారు వచ్చే ఏడాది అంటే 2026లో మార్కెట్లోకి రావచ్చని అంచనా...
ఎక్స్టీరియర్ డిజైన్‌లో మార్పులు:
కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పెద్దగా మారకపోవచ్చు. అలాగే దాని మొత్తం లుక్ పూర్తిగా మార్చకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి కొత్త లుక్‌ని ఇవ్వాలని కంపెనీ అనుకుంటోంది. ఈసారి కొత్తగా కనిపించే 'స్విర్ల్' డిజైన్‌తో నలుపు రంగు అల్లాయ్ వీల్స్ ఉండవచ్చు.హెడ్‌ల్యాంప్స్ మరింత సన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. వెనుక భాగంలో కూడా LED లైట్ బార్ ఉండే అవకాశం ఉంది. ఇక ముందు బంపర్ ఆకారాన్ని కొత్తగా, లేటెస్ట్ గా అప్‌డేట్ చేయవచ్చు.
ఇంటీరియర్ & ఫీచర్లు:
కారు లోపల కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. సీట్ల క్లాత్ అంటే ఫ్యాబ్రిక్ కొత్తగా ఉండవచ్చు. క్యాబిన్ డిజైన్‌లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న 9 అంగుళాలు, 7 అంగుళాల స్క్రీన్ సైజ్ అలాగే ఉండే అవకాశం ఉంది. పాత మోడళ్లకు అదనంగా కొన్ని లేటెస్ట్, అప్ డేట్ భద్రతా ఫీచర్లను అందించొచ్చు, కానీ వాటి గురించి ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.
►ALSO READ | Crypto Safety Guide: 2026లో షార్ట్‌కట్స్ వద్దు: కొత్తగా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు టిప్స్ ఇవే..
ఇంజిన్ :
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లో కూడా ప్రస్తుత ఇంజిన్, గేర్‌బాక్స్ ఉండొచ్చని అంచనా. దీనిలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 103 హార్స్‌పవర్ (hp) శక్తిని, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG అప్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

