V6 News

Crypto Safety Guide: 2026లో షార్ట్‌కట్స్ వద్దు: కొత్తగా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు టిప్స్ ఇవే..

Crypto Safety Guide: 2026లో షార్ట్‌కట్స్ వద్దు: కొత్తగా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు టిప్స్ ఇవే..

దేశంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పట్ల ఉన్న 2025 ముగింపు నాటికి ఇన్వెస్టర్లలో మరింత పెరిగింది. వాట్సాప్ ఫార్వర్డ్‌లు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి విన్న మాటలతో చాలా మంది క్రిప్టో మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది క్రిప్టోను హోల్డ్ చేస్తుండగా.. భారత్ అగ్రగామిగా నిలిచింది. 2025లో దేశీయ క్రిప్టో మార్కెట్ విలువ 2.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే ఈ ఏడాది మెుదటి ఆరు నెలల్లో గ్లోబల్ క్రిప్టో దొంగతనాల విలువ కూడా 2.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అందుకే 2026లో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రయాణం భద్రంగా ఎలా ముందుకెళ్లాలో ఇప్పుడు తెలుసుకోండి.. 

పన్నులు, చట్టాలు తెలుసుకోండి: 
దేశంలో క్రిప్టోలను హోల్డ్ చేయటం, ట్రేడ్ చేయడం చట్టబద్ధమే అయినప్పటికీ.. అది 'లీగల్ టెండర్' కాదని గమనించాలి. క్రిప్టో లాభాలపై భారత ప్రభుత్వం 30% పన్ను, ప్రతి ట్రేడ్‌పై 1% TDSను 2022 నుండి అమలులో ఉంచింది. 2026లో మార్కెట్‌లోకి ప్రవేశించేవారు ఈ పన్ను విధానాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. క్రిప్టోల రేట్ల కదలికల కంటే పోస్ట్-టాక్స్ రాబడులను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక వేసుకోవాలి. అలాగే ప్రతి లావాదేవీని రికార్డ్ చేసుకోండి. సాధ్యమైనంతవరకు నిబంధనలకు అనుగుణంగా ఉండే భారతీయ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టండి. ఆఫ్షోర్ సంస్థలపై ఇప్పటికే నిబంధనలు పాటించనందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌తో స్టార్ట్:
పెట్టుబడి భద్రత మీరు ఎంచుకునే ఎక్స్ఛేంజ్‌పై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆకర్షణీయమైన ప్రకటనలకు లొంగకుండా ఈ విషయాలను గమనించండి.
1. ఎక్స్ఛేంజ్'ప్రూఫ్-ఆఫ్-రిజర్వ్స్'ను ప్రచురించిందా?
2. కస్టమర్ ఆస్తు్ల్లో ఎక్కువ భాగం 'కోల్డ్ స్టోరేజ్'లో ఉంచుతున్నారా?
3. గతంలో ఏదైనా భద్రతా సమస్యలను ప్లాట్‌ఫారమ్‌ ఎదుర్కొందా, వాటిని ఎలా పరిష్కరించారా?

కట్టు కథలకు దూరం:
సెల్ఫ్-కస్టడీ వాలెట్లు సురక్షితమైనవిగా చెప్పినప్పటికీ, భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యత వినియోగదారుడిపైనే పడుతుంది. కొత్త ఇన్వెస్టర్లు చిన్న మొత్తాలతో నియంత్రిత ప్లాట్‌ఫారమ్‌లలో మొదలుపెట్టి, వాలెట్ భద్రతపై అవగాహన పెంచుకున్న తర్వాతే ఆస్తుల్లో కొంత భాగాన్ని సెల్ఫ్-కస్టడీకి తరలించడం మంచిది. అలాగే నెలకు ఖచ్చితంగా ఇంత లాభాలిస్తా అంత లాభాలిస్తాం అంటూ ఆకర్షనీయమైన పథకాలతో మోసగాళ్లు ఆకట్టుకునే ప్రయత్నాలకు అస్సలు లొంగొద్దు. మీ స్థాయికి మించి అప్పులు చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయుద్దు. మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నంతవరకు మాత్రమే పెట్టుబడి పెట్టండి. షార్ట్ కట్స్ జోలికి పోతే ఉన్న డబ్బు పోవచ్చని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ హెచ్చరిస్తున్నారు.

ALSO READ : భారత్‌లో భారీ పెట్టుబడి

పరిమిత పెట్టుబడి మర్చిపోవద్దు:
ప్రస్తుతం దేశంలో చాలా మంది క్రిప్టోలను.. మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్‌తో సమానంగా సరిసమానంగా చూస్తున్న వేళ దానిని మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఒక చిన్న భాగానికి మాత్రమే పరిమితం చేయాలని గుర్తుంచుకోండి. లెవరేజ్ బెట్స్‌కు దూరంగా ఉండటం.. ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియోను రీ-బ్యాలెన్స్ చేయడం వంటి అలవాట్లు ఎక్కువ భద్రతను ఇస్తాయి. 2026లో క్రిప్టోలో సురక్షితంగా ఉండటం అంటే మార్కెట్‌ను అంచనా వేయడం కాదు, మీ రిస్క్ సామర్థ్యాన్ని తెలుసుకోవటమని విక్రమ్ సుబ్బురాజ్ సూచిస్తున్నారు.