V6 News

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో డిసెంబర్, జనవరి నెలల్లో ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో డిసెంబర్, జనవరి నెలల్లో ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి వీఐపీ దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ నెలల్లో పర్వదినాల్లో వీఐపీ  బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఆయా రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టీటీడీ.డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వైకుంఠ దర్శనాలు, జనవరి 30న రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ

డిసెంబర్, జనవరి నెలల్లో పర్వదినాల ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది టీటీడీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాల్సిందిగా భక్తులను కోరింది టీటీడీ. ఇదిలా ఉండగా.. తిరుపతిలో డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 16 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల కార్యక్రమం నిత్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. 

ధనుర్మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారని తెలిపింది టీటీడీ.  టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఏపీలో  76, తెలంగాణ  57, త‌మిళ‌నాడు- 73, క‌ర్ణాట‌క‌- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వ‌హించ‌నున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుమలలో కూడా ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై నివేదించడం విశేషం.