పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' (Ustaad Bhagat Singh) చిత్రం సందడి మొదలైంది. ఈ సినిమాలోని తొలి పాట ‘దేఖ్ లేంగే సాలా’ (Dekhlenge Saala) లిరికల్ వీడియో ప్రోమోను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ భూకంపం స్టార్ట్ అయిందంటూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
‘రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం’
దేవీశ్రీ ప్రసాద్ మాస్ బీట్‌తో కంపోజ్ చేసిన ఈ పాట ప్రోమోలో పవన్ కళ్యాణ్ మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, “రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం” అంటూ సాగే పవన్ స్టైలిష్ స్టెప్పులు థియేటర్లలో స్టేజ్ షేక్ చేయడం గ్యారంటీ అని ప్రోమో స్పష్టం చేస్తోంది. భాస్కరభట్ల అందించిన ఉర్రూతలూగించే సాహిత్యం, ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దడ్లానీ శక్తివంతమైన గాత్రం పాట స్థాయిని పెంచాయి. అభిమానులు ఊగిపోయేలా రూపొందించిన ఈ ఫస్ట్ సింగిల్ పూర్తి పాటను డిసెంబర్ 13న విడుదల చేయనున్నారు.
‘గబ్బర్ సింగ్’ కాంబో రీ-ఎంట్రీ
'గబ్బర్‌సింగ్' (Gabbar Singh) లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన పవన్ కల్యాణ్- దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్.. సినిమా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో హింట్ ఇచ్చి, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. "భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ... ఈసారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది!" అంటూ గ్లింప్స్‌లో పవన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఈ సినిమా పాత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌కు భరోసా ఇస్తున్నాయి.
ALSO READ : ఓటీటీలోకి 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. రామ్ రొమాన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే?
మైత్రీ మూవీ మేకర్స్అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాను మార్చి 26, 2026న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

