V6 News

Gold Rate: బుధవారం గోల్డ్ అప్.. కేజీకి రూ.9వేలు పెరిగిన వెండి.. తెలంగాణలో రేట్లు ఇవే..

Gold Rate: బుధవారం గోల్డ్ అప్.. కేజీకి రూ.9వేలు పెరిగిన వెండి.. తెలంగాణలో రేట్లు ఇవే..

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు మరింతగా పెంచుతున్న వేళ టారిఫ్ ఆందోళనలు కుదిపేస్తున్నాయి ఇన్వెస్టర్లను. దీంతో పాటు మరిన్ని అంతర్జాతీయ కారణాలతో బంగారం, వెండి ధరలు ఊహించని మలుపును చూస్తున్నాయి. దీంతో బంగారం వెండి పోటాపాటీగా పెరుగుతూ తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.  

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 9తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 10న రూ.870 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.87 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 10న):
హైదరాదాబాదులో రూ.13వేల 031
కరీంనగర్ లో రూ.13వేల 031
ఖమ్మంలో రూ.13వేల 031
నిజామాబాద్ లో రూ.13వేల 031
విజయవాడలో రూ.13వేల 031
కడపలో రూ.13వేల 031
విశాఖలో రూ.13వేల 031
నెల్లూరు రూ.13వేల 031
తిరుపతిలో రూ.13వేల 031

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 9తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 10న 10 గ్రాములకు రూ.800 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 10న):
హైదరాదాబాదులో రూ.11వేల 945
కరీంనగర్ లో రూ.11వేల 945
ఖమ్మంలో రూ.11వేల 945
నిజామాబాద్ లో రూ.11వేల 945
విజయవాడలో రూ.11వేల 945
కడపలో రూ.11వేల 945
విశాఖలో రూ.11వేల 945
నెల్లూరు రూ.11వేల 945
తిరుపతిలో రూ.11వేల 945

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని కొనసాగిస్తోంది. డిసెంబర్ 10న కేజీకి వెండి డిసెంబర్ 9తో పోల్చితే రూ.9వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 07వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.207 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.